మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. శివసేనలో తనో కార్పొరేటర్ గా థానేలో పనిచేస్తున్న సమయంలో తన ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్న ఘటనను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవిస్ శిందేను ఓదార్చే ప్రయత్నం చేశారు.